నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో గల సింగిల్ విండో కార్యదర్శిగా విధులు నిర్వహించి ఇటీవల పదవి విరమణ పొందిన జే బాబు పటేల్ చేసిన సేవలు ఆయన సుదీర్ఘ విధులు అమూల్యమైనవని మద్నూర్ మండల స్పెషల్ అధికారి రామ్మోహన్ అన్నారు. పదవి విరమణ పొంది రెండు నెలలు గడిచిపోయిన తర్వాత ఆయనకు మండల స్పెషల్ అధికారి మద్నూర్ సింగిల్ విండో కార్యాలయంలో శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మండల స్పెషల్ అధికారి మాట్లాడుతూ.. సుదీర్ఘమైన సేవలు అమూల్యమైనవి అని పేర్కొన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలు, మాజీ సింగిల్ విండో చైర్మన్ కొండ గంగాధర్, మండల వ్యవసాయ అధికారి రాజు, సింగిల్ విండో కార్యదర్శి గంగాధర్, పవురు రైతులు పాల్గొన్నారు.
బాబు పటేల్ సేవలు అమూల్యమైనవి: ఎమ్ఎస్ఓ రామ్మోహన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



