- Advertisement -
హైదరాబాద్ : ఆల్ ఇండియా యూనివర్శిటీస్ (ఏఐయూ) జాతీయ తైక్వాండో చాంపియన్‌షిప్స్‌కు పరిశీలకుడిగా (అబ్జర్వర్) తెలంగాణకు చెందిన జె. బాబులాల్ నియమితులయ్యారు. ఈ నెల 16 నుంచి 20 వరకు జలంధర్‌లోని డిఏవీ విశ్వవిద్యాలయం వేదికగా తైక్వాండో ఆల్ ఇండియా యూనివర్శిటీస్ జాతీయ చాంపియన్‌షిప్స్ జరుగనున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి విశ్వవిద్యాలయ జట్లు ఈ పోటీల్లో పాల్గొంటాయి. ఈ ప్రతిష్టాత్మక పోటీలకు పరిశీలకుడిగా ఎంపికవటం గర్వంగా ఉందని బాబులాల్ తెలిపారు.
- Advertisement -



