– ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
– ఆర్థిక ఇబ్బందులతోనే విక్రయించామంటున్న తల్లిదండ్రులు
– మెదక్ సఖీ కేంద్రానికి శిశువు తరలింపు
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
నెల రోజుల పసికందును తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులతో రూ.1.50 లక్షలకు విక్రయించిన ఘటన మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం లింగసాన్ పల్లి తండాలో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హవేలీ ఘనపూర్ ఎస్‌ఐ సత్యనారాయణ, ఐసీడీఎస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగసాన్‌పల్లి తండాకు చెందిన కేతావత్ మంజుల, మహేష్ దంపతులు.. మంజుల గత నెల 10వ తేదీన మగబిడ్డకు జన్మనిచ్చింది. మంజుల దంపతులకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఈనెల 4వ తేదీన మెదక్ పట్టణంలోని కీర్తి బేకరీ వద్ద హవేలీ ఘనపూర్‌కు చెందిన కుమ్మరి నాగరాజు, అతని భార్య స్వప్నకు శిశువు విక్రయానికి పూనుకున్నారు. ముందుగా రూ.5లక్షలకు అమ్మేందుకు నిర్ణయించుకుని తర్వాత రూ.1.50లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. మండలంలోని శాలీపేట గ్రామ శివారులో శిశువును విక్రయిస్తున్నట్టు స్టాంప్ పేపర్‌పై రాయించుకుని భార్య భర్తలిద్దరి సంతకాలు తీసుకుని బాబుని వారికి అప్పగించారు. అయితే మంజుల గత వారం రోజుల నుంచి అంగన్‌వాడీ కేంద్రంలో లభించే అనుబంధ పోషకా హారం గురించి రాకపోవడంతో విచారిం చేందుకు అంగన్‌వాడీ టీచర్ మంజుల ఇంటికి వెళ్లగా.. తాళం వేసి ఉంది. దాంతో విషయాన్ని ఐసీడీఎస్ ఇన్‌చార్జి విజయలక్ష్మీకి తెలిపింది. కాగా, దాంతో మంజుల దంపతుల వెతుకులాటను ప్రారంభించిన అధికారులు.. ఈనెల 9వ తేదీన మంజుల, మహేష్ ఇద్దరూ చేగుంట బస్‌స్టాప్ వద్ద ఉన్నట్టు గుర్తించారు. వారిని ఐసీడీఎస్ ఇన్‌చార్జి విజయలక్ష్మీ పట్టుకుని హవేలీ ఘనపూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారిని ఎస్‌ఐ విచారించగా.. ఆర్థిక ఇబ్బందుల వల్ల శిశువును అమ్మివేశామని తెలిపారు.
అనంతరం హావేలీ ఘనపూర్‌కు చెందిన కుమ్మరి నాగరాజు అతని భార్య స్వప్నను విచారించగా వారు వారి బంధువులైన కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండలం కంచర్ల గ్రామానికి చెందిన నరసోల్ల రాజు, అతని భార్య నరసోల్ల రజితకు పిల్లలు లేనందున కేతావత్ మంజుల శిశువును రూ.1.50లక్షలకు బేరం కుదుర్చుకుని బంధువులకు అప్పగించినట్టు తెలిపారని డీఎస్పీ తెలిపారు. దాంతో ఎస్‌ఐ సత్యనారాయణ వారి సిబ్బందితో కలిసి హుటాహుటిన కంచర్ల గ్రామానికి వెళ్లి నరసోల్ల రాజు దగ్గర నుంచి మగ శిశువును తీసుకువచ్చారు. అనంతరం శిశువుతోపాటు శిశువు తల్లి కేతావత్ మంజులను సఖీ కేంద్రంలో అప్పగించినట్టు పోలీసులు తెలిపారు.
రూ.1.50 లక్షలకు శిశువిక్రయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



