- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో గుర్తు తెలియని శిశువు మృతదేహం నీటిలో తేలుతూ కనిపించిన ఘటన కలకలం రేపింది. కోళ్లపడకల్ గ్రామ శివారులో ఉన్న పత్తే సాగర్ చెరువు అలుగు వద్ద ఆదివారం మృతదేహాన్ని చూసి స్థానికులు ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. శిశువు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చెరువులో ఎవరు వదిలిపెట్టారనే కోణంలో విచారిస్తున్నారు.
- Advertisement -