Wednesday, December 31, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమురుగు కాలువలో పసికందు మృతదేహం 

మురుగు కాలువలో పసికందు మృతదేహం 

- Advertisement -

– వివరాలు ఆరాతీస్తున్నా పోలీసులు 
నవతెలంగాణ – మిర్యాలగూడ 
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో బుధవారం మురుగు కాలువలో పసికందు మృతదేహం లభ్యమైనది. పట్టణంలోని షాబు నగర్ మురుగు కాలువలో అభం శుభం తెలియని ఓ చిన్నారి మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వన్టౌన్ సీఐ నాగభూషణం సంఘటన చేరుకొని వివరాలు సేకరించారు. గుర్తు తెలియని వ్యక్తులు చిన్నారి మృతదేహాన్ని కాలువలో పడేసినట్లు అనుమానిస్తున్నారు. పసికందును బతికుంటగానే వేశారా, లేక చనిపోయాక వేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. విషయం స్థానిక కాలనీ ప్రజలకు తెలియడంతో ప్రజలు పెద్ద ఎత్తున అక్కడ చేరుకొని అయ్యో పాపం అంటూ అవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -