నవతెలంగాణ – జగిత్యాల
సీపీఐ(ఎం) జగిత్యాల జిల్లా కన్వీనర్‌గా బచ్చల వినోద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో శనివారం జిల్లా కమిటీ సభ్యురాలు ఇందూరి సులోచన అధ్యక్షతన జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే వినోద్‌ను పార్టీ జిల్లా కన్వీనర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు రాష్ట్ర కమిటీ సభ్యులు లెల్లెల బాలకృష్ణ తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీ ఆధ్వర్యంలో మళ్లీ భూ పోరాటాలు నిర్వహిస్తా మన్నారు. జగిత్యాల జిల్లాలో రైతులకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉంచాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందే సాగు విస్తీర్ణాన్ని అంచనా వేసి సరిపడా యూరియా అందించడంలో, తెప్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను రాష్ట్ర ప్రభుత్వం ఖండిస్తూ పోరాడాలన్నారు. ఈ సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్ ఎంఎ.చౌదరి, కోమటి చంద్రశేఖర్, వి.వెంకటచారి, కుంచం శంకర్, మల్యాల సురేష్, మహిపాల్ నాయక్, బోర్ర శేఖర్, ఇందూరి సులోచన, నాయిని శారద తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ(ఎం) జగిత్యాల జిల్లా కన్వీనర్‌గా బచ్చల వినోద్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES