అదానీ గ్రూప్ చేతికి మరో వార్తాసంస్థ
న్యూఢిల్లీ :ప్రధాని మోడీకి సన్నిహితుడైన ప్రముఖ బిలియనీర్ గౌతమ్ అదానీ మీడియాను తమ గుప్పెట్లోకి తెచ్చుకుంటున్నారు. నాడు ఎన్డీటీవీని దక్కించుకోగా..నేడు ఐఏఎన్‌ఎస్‌ను స్వాధీనం చేసుకున్నారు. అదానీ గ్రూప్ 24 శాతం వాటాను కొనుగోలు చేసి ఇండో-ఆసియన్ న్యూస్ సర్వీస్(ఐఏఎన్‌ఎస్)ను స్వాధీనం చేసుకుంది. ఈ వార్తా సంస్థకు సంబంధించిన 24 శాతం వాటాను ఎంతమొత్తంలో కొనుగోలు చేసిందనే విషయాన్ని అదానీ గ్రూప్ వెల్లడించలేదు. ఈ విషయాన్ని అదానీ ఎంటర్ ప్రైజెస్ యొక్క మీడియా విభాగం అయిన ఎఎంజీ మీడియా నెట్‌వర్క్ లిమిటెడ్.. ఐఏఎన్‌ఎస్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్‌లో మిగిలిన వాటాను కొనుగోలు చేయడానికి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు తాజాగా అదానీ కంపెనీ స్టాక్ ఎక్స్చ్‌ంజ్ ఫైలింగ్ తెలిపింది.
కాగా, డిసెంబర్ 2023లో అదానీ గ్రూప్ ఐఏఎన్‌ఎస్ వార్తా సంస్థలో 50 :50 శాతం మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. దీంతో ఈ న్యూస్ వైర్ ఏజెన్సీ అదానీ మీడియా విభాగానికి అనుబంధ సంస్థగా మారింది. జనవరి 2024లో ఎఎంజీ మీడియా నెట్‌వర్క్స్ లిమిటెడ్ (ఎఎంఎన్‌ఎల్) తన ఓటింగ్ హక్కులతో ఐఏఎన్‌ఎస్ షేర్ల యాజమాన్యాన్ని 76 శాతానికి పెంచుకుంది. ఐఏఎన్‌ఎస్‌లో మిగిలిన వాటాను కొనుగోలు చేయడానికి ఎఎంఎన్‌ఎన్‌ఎల్ జనవరి 21, 2026న షేర్ కొనుగోలు ఒప్పందాన్ని అమలు చేసింది. దీంతో ఐఏఎన్‌ఎస్ కంపెనీ పూర్తిగా కంపెనీ యాజమాన్య సంస్థగా మారుతుందని అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ ఫైలింగ్ తెలిపింది.
నాడు ఎన్డీటీవీ.. నేడు ఐఏఎన్‌ఎస్
- Advertisement -
- Advertisement -



