నిరుద్యోగుల నోట్లో మట్టి కొడుతున్న కాంగ్రెస్ సర్కారు : తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలను బ్యాక్ డోర్ ద్వారా నియమిస్తున్నదని తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బీఆర్‌ఎస్ ఉన్నప్పుడు స్టేట్ లెవల్ పోస్టులను కూడా ప్రొవిజన్ అనే చిన్న పదాన్ని పట్టుకొని పరీక్షలు లేకుండానే ఉద్యోగం ఇచ్చిందని గుర్తు చేశారు. లక్షన్నర జీతం ఉన్న ఉద్యోగాలను బోయినపల్లి సరితతో పాటు చాలా మందికి వచ్చినట్లు వింటున్నామని తెలిపారు. శనివారం ఈమేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.
నిర్మల్‌లో కూడా జిల్లా స్థాయిలో ఉన్న 44 పోస్టులను పది నుంచి 15 లక్షలకు అమ్ముకున్నారని తెలిపారు. అప్పటి బీఆర్‌ఎస్ నాయకులే ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరి న్యాయం జరగకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ట్రాన్స్‌కో, జెన్‌కో, ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ శాఖల్లో ఉద్యోగాలను రిక్రూట్ చేస్తున్నారని తెలిపారు. జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్ లాంటి పోస్టులను భర్తీ చేస్తున్నారని పేర్కొనానరు. ఇవన్నీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీల బ్యాక్ లాగ్ పోస్టులేనని గుర్తు చేశారు. కొంత మంది రాజకీయ నాయకులు, అవినీతి అధికారులు పైరవీలతో పోస్టులను అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
బ్యాక్ డోర్‌లో బ్యాక్‌లాగ్ పోస్టులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES

