- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: పీఎం కిసాన్ సమ్మాన్ యోజన 22వ విడత కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ నిధులు ఫిబ్రవరి నెలలో విడుదల చేసే అవకాశం ఉంది. అయితే కెవైసీ పూర్తి చేసుకున్న రైతులకు మాత్రమే ఈ నగదు జమ అవుతుంది. కెవైసీ పూర్తి చేయని రైతుల వాయిదాలు నిలిచిపోనున్నాయి. రైతులు ఇంటి నుండే ఓటీపీ ద్వారా పీఎం కిసాన్ ఈ- కెవైసీ పూర్తి చేసుకోవచ్చు. ఈ పథకం కింద రైతులు రూ.6 వేలు వార్షిక సహాయాన్ని రూ.2 వేలు చొప్పున మూడు వాయిదాలలో పొందుతారు. లబ్ధిదారుల జాబితాను పీఎం కిసాన్ వెబ్ సైట్ లో తనిఖీ చేసుకోవచ్చు.
- Advertisement -



