- Advertisement -
నవతెలంగాణ – మిరుదొడ్డి
ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వడ్ల రాములు కుటుంబాన్నికి బహుజన మిత్రులు అండగా నిలిచారు. అక్బర్‌పేట-భూంపల్లి మండలం, భూంపల్లిగ్రామానికి చెందిన వడ్ల రాములు గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ నాల్గు రోజుల కిందట మృతి చెందిన విషయం తెలిసి, గురువారం బహుజన మిత్రులు వారి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం వారికి చేయుతగా 50 కేజీల బియ్యాన్ని సహాయంగా అందించారు. ఈ కార్యక్రమంలో బహుజన మిత్రబృందం పాల్గొన్నారు.
- Advertisement -