Friday, October 3, 2025
E-PAPER
Homeజాతీయంటీవీకే పార్టీ నేతకు బెయిల్ నిరాక‌ర‌ణ‌

టీవీకే పార్టీ నేతకు బెయిల్ నిరాక‌ర‌ణ‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: కరూర్‌ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో టివికె పార్టీ నేతకు బెయిల్‌ ఇచ్చేందుకు మద్రాస్‌ హైకోర్టు శుక్రవారం నిరాకరించింది. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ టివికె నామక్కల్‌ జిల్లా కార్యదర్శి సతీష్‌కుమార్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు. ఈ పిటిషన్‌ను నేడు కోర్టు కొట్టివేసింది. ర్యాలీ సమయంలో జనాన్ని నియంత్రించడంలో పార్టీ ఎందుకు విఫలమైందని కోర్టు ప్రశ్నించింది.
ఇదిలావుంటే తొక్కిసలాట బాధితులకు అదనపు పరిహారం కోరుతూ దాఖలైన మరో పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ జరిపింది. ఈ పిటిషన్‌పై మీ స్పందన తెలియజేయాలని ఆదేశిస్తూ కోర్టు.. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఇటీవల విజరు ప్రచార ర్యాలీ సందర్భంగా కరూర్‌లో తొక్కిసలాట జరిగింది. ఆ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మందికిపైగా గాయపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -