Thursday, October 16, 2025
E-PAPER
Homeజాతీయంగోవింద్‌ పన్సారే హత్య కేసులో ప్రధాన నిందితులకు బెయిల్‌

గోవింద్‌ పన్సారే హత్య కేసులో ప్రధాన నిందితులకు బెయిల్‌

- Advertisement -

ముంబయి : ప్రముఖ హేతువాది, సీపీఐ నాయకులు గోవింద్‌ పన్సారే హత్య కేసులో ప్రధాన నిందితులకు బెయిల్‌ లభించింది. ముగ్గురు నిందితులకు బాంబే హైకోర్టు బెయిల్‌ను మంజూరు చేసింది. నిందితులు వీరేంద్ర తావ్డే, శరద్‌ కలస్కర్‌, అమోల్‌ కాలేలకు బెయిల్‌ మంజూరు చేస్తూ హైకోర్టు కొల్హాపూర్‌ బెంచ్‌ జడ్జి జస్టిస్‌ శివకుమార్‌ దిగ్డే ఆదేశాలిచ్చారు. గోవింద్‌ పన్సారేను 2015లో ఇద్దరు దుండగులు ఆయన ఇంటివద్దే కాల్చి చంపిన విషయం విదితమే. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురికి హైకోర్టు జనవరిలో బెయిల్‌ ఇచ్చింది. తాజాగా ఈ ముగ్గురు నిందితులకు కూడా బెయిల్‌ లభించటం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -