Wednesday, May 14, 2025
Homeతెలంగాణ రౌండప్టీడీపీ మండల అధ్యక్షుడిగా బైన బిక్షపతి 

టీడీపీ మండల అధ్యక్షుడిగా బైన బిక్షపతి 

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవంగర: తెలుగు దేశం పార్టీ మండల అధ్యక్షుడిగా ఉప్పెరగూడెం గ్రామానికి చెందిన బైన బిక్షపతి నాలుగోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల పరిశీలకులు బొక్క రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో నూతన అధ్యక్షుడి ఎన్నిక మంగళవారం మండల కేంద్రంలో చేపట్టారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు బిక్షపతి మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచిందన్నారు. డ్వాక్రా గ్రూపుల స్థాపన నుంచి ప్రతి రంగంలో మహిళలను అభివృద్ధి పరచిన ఘనత టీడీపీదేనని కొనియాడారు. పార్టీకి పూర్వవైభవం తెచ్చి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన జిల్లా, మండల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ పాలకుర్తి మండల అధ్యక్షుడు గజ్జెల్లి వెంకటేశ్వర్లు, తొర్రూరు మండల అధ్యక్షుడు బోగ భాస్కర్, మాజీ ఎంపీపీ సంగని శంకర్ రావు, నాయకులు బైన వినోద, గద్ద లింగయ్య, గద్దల కొమురయ్య, బందు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -