ప్లే ఆఫ్స్ కోసం తీసుకున్న ముంబయి ఇండియన్స్
ముంబయి : ఇంగ్లాండ్ క్రికెటర్, వేలంలో అమ్ముడుపోని ఆటగాడు జానీ బెయిర్‌స్టో గరిష్టంగా నాలుగు మ్యాచులకు రూ.5.25 కోట్లు అందుకోనున్నాడు. ఐపీఎల్18 ప్లే ఆఫ్స్‌కు ఇంకా బెర్త్ ఖాయం చేసుకోని ముంబయి ఇండియన్స్.. ముగ్గురు విదేశీ క్రికెటర్లను కొనుగోలు చేసింది. జానీ బెయిర్‌స్టో సహా రిచర్డ్ గ్లీసన్ (ఇంగ్లాండ్), చరిత్ అసలంక (శ్రీలంక) ముంబయి ఇండియన్స్ తరఫున ఆడనున్నారు. గ్లీసన్‌కు రూ.1 కోటి ఇవ్వనుండగా. అసలంక రూ.75 లక్షలు అందుకోనున్నాడు. ఈ మేరకు ఐపీఎల్ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. ముంబయి ఇండియన్స్ తీసుకున్న ప్రత్యామ్నాయ ఆటగాళ్ల ఒప్పదం ప్లే ఆఫ్స్ నుంచి అమల్లోకి రానుంది. ముంబయి ఇండియన్స్ జట్టులోని విల్ జాక్స్, రియాన్ రికెల్టన్, కార్బిన్ బాచ్‌లు గ్రూప్ దశ మ్యాచుల తర్వాత అందుబాటులో ఉండటం లేదు. విల్ జాక్స్ వెస్టిండీస్‌తో వైట్‌బాల్ సిరీస్ కోసం వెళ్లనుండగా.. రికెల్టన్, బాచ్‌లు ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ కోసం ఇంగ్లాండ్‌కు వెళ్లాల్సి ఉంది. ప్లే ఆఫ్స్‌లో చోటు కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోటీపడుతున్న ముంబయి ఇండియన్స్.. ముందుగానే ముగ్గురు విదేశీ క్రికెటర్లను జట్టులోకి తీసుకుని డ్రెస్సింగ్‌రూమ్ వాతావరణానికి అలవాటు పడేలా చేయనుంది!.
బెయిర్‌స్టోకు రూ.5.25 కోట్లు
- Advertisement -
- Advertisement -