Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఘనంగా బక్రీద్ పర్వదిన వేడుకలు ..

ఘనంగా బక్రీద్ పర్వదిన వేడుకలు ..

- Advertisement -

నవతెలంగాణ – తాడ్వాయి 
మండల కేంద్రంలో బక్రీద్ పర్వదిన వేడుకలు ముస్లిం మైనారిటీ పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. తాడ్వాయి, కాటాపూర్, నార్లాపూర్  తదితర గ్రామాల్లో పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయం ఊరేగింపుగా మసీదులు, ఈద్గాల వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తాడ్వాయి, కాటాపూర్ మసీదులలో ముత్తవల్లీల ప్రత్యేక ప్రార్థనల అనంతరం ధార్మికో ఉపన్యాసం చేశారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ బక్రీద్ పండుగను శనివారం జరుపుకుంటున్నారన్నారు. త్యాగ నిరతికి బక్రీద్ పండుగ నిదర్శనమని అన్నారు. ధనిక, పేద అన్న తారతమ్యం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా మైనారిటీలందరూ భక్తిశ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ దాన గుణం, సేవాగుణం అలవర్చుకోవాలని చెప్పారు. పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, బంధుమిత్రులతో సంతోషంగా గడిపారు. బక్రీద్ విశిష్టతలో భాగమైన ఖుర్బానీ ని చుట్టుపక్కల వారికి దానంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో తాడ్వాయి ఇమామ్ రెహ్మాన్, సదర్ అక్బర్, సభ్యులు రఫీ, యాకూబ్,  సుజాయిద్దీన్, రియాజ్, షరీఫ్, రియాజ్, షఫీ, కాటాపూర్, ఇమామ్ సదర్ ముస్లిం మత పెద్దలు ముస్లింలు మైనార్టీలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad