త్యాగానికి ప్రతీక బక్రీద్‌

Bakrid is a symbol of sacrifice– ముస్లిం సోదరులకు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్‌ (ఈద్‌ ఉల్‌ అజ్‌) పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇస్లాం ప్రవక్తల్లో ఒకరైన ఇబ్రహీం అస్సలామ్‌, అల్లా ఆజ్ఞను శిరసావహించి తన కుమారుడిని సైతం బలి ఇచ్చేందుకు సిద్ధం కావడాన్ని స్మరిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు ఈ పండుగ జరుపుకుంటున్నారని గుర్తు చేశారు. ప్రవక్తల అచంచలమైన దైవ భక్తి, త్యాగ నిరతికి ఈ పండుగ అద్దం పడుతుందని పేర్కొన్నారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయపడకుండా, దేవునిపై విశ్వాసంతో, సన్మార్గంలో జీవనం సాగించాలని ఈ పండుగ మానవాళికి గొప్ప సందేశాన్ని ఇస్తుందని తెలిపారు. తమకు ఉన్న దాంట్లో నుంచే ఇతరులకు పంచిపెట్టడాన్ని మించిన దాతృత్వం మరొకటి లేదనే స్ఫూర్తిని చాటి చెబుతోందని సీఎం అభిప్రాయపడ్డారు. ఇదిలా వుండగా మాజీ ఎంపీ వి. హనుమంతరావు జన్మదినాన్ని పురస్కరించుకుని సీఎం రేవంత్‌రెడ్డి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Spread the love