Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్త్యాగానికి ప్రతీక బక్రీద్..

త్యాగానికి ప్రతీక బక్రీద్..

- Advertisement -

నవతెలంగాణ – నసురుల్లాబాద్ : ఈద్ ఉల్-అధా బక్రీద్ పండుగ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు మాజీ ఎంపీటీసీ ఫోరం కన్వీనర్ కంది మల్లేష్ నసురుల్లాబాద్ మండల కేంద్ర సర్పంచ్ అరిగే సాయిలు ఈద్గా కు వచ్చి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. త్యాగానికి, సహనానికి, భక్తి విశ్వాసాలకు బక్రీద్ పండుగ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. శాంతి, కరుణ, సహనం, సామరస్యం, ఐకమత్యం, సోదరభావం స్ఫూర్తితో ఈ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా భాగస్వామ్యం, దానధర్మం, గౌరవం, అవసరమైన వారికి సాయం చేయడం బక్రీద్ పండుగ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. దేవుడిపై విశ్వాసంతో సన్మార్గంలో జీవనం సాగించాలని సందేశాన్ని బక్రీద్ ఇస్తుందని  అన్నారు. వీరి వెంట సీనియర్ నాయకులు తదితరులు ఉన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad