నవతెలంగాణ – మల్హర్ రావు: త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగని తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఇప్ప మొండయ్య అన్నారు. ఈద్ ఉల్-అధా (బక్రీద్) పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. త్యాగానికి, సహనానికి, భక్తి విశ్వాసాలకు బక్రీద్ పండుగ ప్రతీకగా నిలుస్తుందన్నారు. శాంతి, కరుణ, సహనం, సామరస్యం, ఐకమత్యం, సోదరభావం స్ఫూర్తితో ఈ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. భాగస్వామ్యం, దానధర్మం, గౌరవం, అవసరమైన వారికి సాయం చేయడం బక్రీద్ పండుగ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. దేవుడిపై విశ్వాసంతో సన్మార్గంలో జీవనం సాగించాలని సందేశాన్ని బక్రీద్ తెలుపుతుందన్నారు.
త్యాగానికి ప్రతీక బక్రీద్ : పీఏసీఎస్ చైర్మన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES