Sunday, January 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాజస్థాన్ వాసి బలవర్మనం..

రాజస్థాన్ వాసి బలవర్మనం..

- Advertisement -

-మండల కేంద్రంలో ఉరేసుకుని ఆత్మహత్య 
-ఆనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నాడని వినికిడి
నవతెలంగాణ-బెజ్జంకి

ఆనారోగ్య సమస్యలు వాటికి తోడు భార్య వదిలివెళ్లడం వంటి వాటితో మనఫ్థాపానికి గురై రాజస్థాన్ వాసి సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని ఊర చెరువు సమీపంలో బేగంపేట ప్రధాన ప్రక్కన చెట్టుకు ఉరేసుకుని బలవర్మణానికి పాల్పడి మృతిచెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది.బేగంపేట గ్రామస్తుల వివరాల ప్రకారం రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన కాందిలి జెటా మంగళ్ పటేల్,కాందిలి జెటా రామ్ పటేల్ ఇద్దరు స్వంత అన్నదమ్ములు.గతంలో ఇద్దరు అన్నదమ్ములు మండల కేంద్రంలో హోటల్ నిర్వహించి జీవనం సాగించారు.కాలక్రమేణా ఇద్దరు అన్నదమ్ములు స్వంతంగా వ్యాపారాలు నిర్వహించుకుంటున్నారు.మంగళ్ పటేల్ మండలంలోని బేగంపేటలో స్థిరపడగా మృతుడు జెట్ రాం పటేల్(40) రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పెద్దలింగాపూర్ గ్రామంలో హోటల్ యందు పని చేస్తున్నాడు.శుక్రవారం రాత్రి సమయంలో జెట్ రాం మదుమేహ వ్యాధికి మందులు కొనుగోలు చేసుకుని మండల కేంద్రంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందాడు.మృతునికి భార్య,కుమారుడున్నారని…వారు రాజస్థాన్ యందు జీవనం సాగిస్తున్నట్టు సమాచారం.ఎస్ఐ సౌజన్య సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.వివరాలు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.
* సమస్యలతో మనస్థాపానికి గురవుతూ..
గత కొన్నేళ్లుగా మదుమేహ వ్యాధి,భార్య వదిలివెళ్లడం వంటి సమస్యలతో జెటా రాం పటేల్ తరచూ మనస్థాపానికి గురవుతుండేవాడని బేగంపేట వాసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -