Saturday, November 22, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు బల్దియా షాక్‌

అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు బల్దియా షాక్‌

- Advertisement -

విస్తీర్ణం తక్కువ చూపిస్తూ పెద్దఎత్తున ట్రేడ్‌ లైసెన్స్‌ ఎగవేత
పూర్తి స్థాయిలో ఫీజు చెల్లించాలంటూ నోటీసులు
నవతెలంగాణ-సిటీబ్యూరో

హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో, రామా నాయుడు స్టూడియోస్‌కు బల్దియా షాకిచ్చింది. నగరం లోని రెండు ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలైన అన్నపూర్ణ స్టూడియోస్‌ (బంజారాహిల్స్‌), రామానాయుడు స్టూడి యోస్‌ (ఫిల్మ్‌నగర్‌) తమ వ్యాపార విస్తీర్ణం తక్కువ చూపి స్తూ.. ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజు తక్కువ చెల్లిస్తున్నట్టు జీహెచ్‌ఎంసీ సర్కిల్‌-18 అధికారులు గుర్తించారు. ఈ మేరకు ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజు పూర్తి స్థాయిలో చెల్లించాలంటూ నోటీసులు జారీ చేశారు. ఈ రెండు సంస్థలు చాలా సంవత్సరాలుగా ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజును చెల్లిస్తున్నప్పటికీ, రికార్డుల్లో చూపిన విస్తీర్ణం కంటే వాస్తవ విస్తీర్ణం (ప్లింత్‌ ఏరియా) చాలా ఎక్కువగా ఉందని అధికారులు గుర్తించారు. ఈ స్టూడియోల్లో జరిగే సినిమా షూటింగ్‌లకు భారీ మొత్తంలో అద్దెల రూపంలో ఆదాయం వస్తున్నది. అయితే, వస్తున్న ఆదాయాన్ని తక్కువగా చూపిస్తూ, ఆ మేరకు ట్రెడ్‌లైసెన్స్‌ ఫీజు కూడా తక్కువగా చెల్లిస్తున్నారు.
అన్నపూర్ణ స్టూడియోస్‌
అన్నపూర్ణ స్టూడియోస్‌ ప్రయివేటు లిమిటెడ్‌ 8,172 చదరపు అడుగులు ప్లింత్‌ ఏరియా ఆధారంగా యాజ మాన్యం రూ.49,032 ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజు చెల్లిస్తూ వస్తోంది. అయితే, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ శాఖ నిర్వ హించిన పరిశీలనలో వాస్తవ ప్లింత్‌ ఏరియా 1,92,066 చదరపు అడుగులున్నట్టు తేలింది. ఈ క్రమంలో స్టూడియో చెల్లించాల్సిన కొత్త ఫీజు ఏడాదికి రూ.11,52,396గా నిర్ణయించిన అధికారులు నోటీసులు జారీ చేశారు.
రామానాయుడు స్టూడియో
సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రయివేటు లిమిటెడ్‌ పేరుతో నడుస్తున్న రామానాయుడు స్టూడియోస్‌ 1,903 చదరపు అడుగుల విస్తీర్ణం చూపిస్తూ యాజమాన్యం ఏటా రూ.7,614 మాత్రమే చెల్లిస్తోంది. అయితే అధికారుల పరిశీలనలో అసలు ప్లింత్‌ ఏరియా 68,276 చదరపు అడుగులుగా తేలింది.
దీని ప్రకారం స్టూడియో చెల్లించాల్సిన కొత్త ఫీజు ఏడాదికి రూ.2,73,104గా జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులలో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -