ఈసీకి బీఆర్‌ఎస్ నాయకుల ఫిర్యాదు
విచారణకు నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశం
స్టేజ్ 2 ఆర్‌ఓ సస్పెన్షన్
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోలైన బ్యాలెట్ పత్రాలు డ్రయినేజీ కాల్వలో ప్రత్యక్షమైన ఘటన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం చిన్న కాపర్తి గ్రామంలో శుక్రవారం రాత్రి వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తమ పార్టీ బలపర్చిన అభ్యర్థి రుద్రారపు భిక్షపతికి చెందిన కత్తెర గుర్తు ఉన్న బ్యాలెట్ పేపర్లు డ్రయినేజీలో కనిపించటంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో కలెక్టర్ ఇలా త్రిపాఠి విచారణకు ఆదేశించారు. బ్యాలెట్ పత్రాలు బయటికి వచ్చిన ఘటనలో స్టేజ్-టు ఆర్‌ఓగా విధులు నిర్వర్తించిన నార్కట్‌పల్లి మండలం అమ్మనబోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హిందీ పండిట్ ఎర్ర విజరుకు మార్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పోలైన బ్యాలెట్ పేపర్లను బయటకు తీసుకొచ్చిన పేరు తెలియని వ్యక్తిపై 233 సెక్షన్ కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు కలెక్టర్ వెల్లడించారు. ఈ మొత్తం ఘటనపై విచారణ నిర్వహించేందుకు నల్లగొండ ఆర్డీఓను విచారణ అధికారిగా నియమించినట్టు తెలిపారు. మిగిలిపోయిన బ్యాలెట్ పత్రాలన్నింటినీ ఆర్డీఓ సమక్షంలో భద్రపరచాలని, దీనిని వీడియో రికార్డు చేయించాలని ఆదేశించారు.
డ్రయినేజీలో బ్యాలెట్ పత్రాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



