నవతెలంగాణ-హైదరాబాద్: పాకిస్థాన్‌లో బలోచ్ రెబల్స్ మరోసారి రెచ్చిపోయింది. తాజాగా దక్షిణ బలోచిస్థాన్ ప్రావిన్స్‌లో పలు వాహనాలపై దాడి చేసి తొమ్మిది మందిని కాల్చి చంపారు. ముందుగా గురువారం సాయంత్రం పలు బస్సులను ఆపి వీరిని కిడ్నాప్ చేశారు. అనంతరం సమీపంలోని పర్వతాల్లోకి వారిని తీసుకెళ్లి హత్య చేసినట్లు ఓ ఆంగ్ల వార్తా సంస్థ వెల్లడించింది. అర్ధరాత్రి వారి మృతదేహాలు బయటపడినట్లు గవర్నమెంట్ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటివరకు ఏ గ్రూపు ఈ దాడికి బాధ్యత వహించలేదు. కానీ, ఈ ప్రాంతంలో గతంలో ఇలాంటి ఘటనలకు పాల్పడిన చరిత్ర బలోచ్ రెబల్స్‌కు ఉంది. ముఖ్యంగా పంజాబ్ ప్రావిన్స్ వారిని గుర్తించి మరీ కిడ్నాప్ చేశారు.
బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ పాక్ ప్రభుత్వంపై అతిపెద్ద దాడిని మంగళవారం ప్రారంభించింది. దీనికి ‘ఆపరేషన్ బామ్’ అనే పేరు పెట్టింది. బలోచిస్థాన్ ప్రావిన్స్‌లోని చాలా జిల్లాల్లో ప్రభుత్వ, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసింది.