Wednesday, January 21, 2026
E-PAPER
Homeఆదిలాబాద్వెదురు వేలంపాట వాయిదా..

వెదురు వేలంపాట వాయిదా..

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్ 
మండలంలోని ముద్గల్ బ్యాంబు ఫామ్ నందు వేలంపాట కమిటీ ఆధ్వర్యంలో వెదురు కర్రల వెదురు కర్రల బహిరంగ వేలంను బుధవారం నిర్వహించారు. అయితే వేలంపాట లో నలుగురు పాటదారులు పాల్గొన్నప్పటికి  అనుకున్న ధర రానందువలన కమిటీ సభ్యులు ఇట్టి వేలంపాటను వాయిదా వేయడం జరిగిందని, జిల్లా ఉద్యాన , పట్టు పరిశ్రమ శాఖ అధికారి  బివి రమణ, తెలిపారు. తదుపరి వేలం పాట తేదీని కమిటీ ద్వారా నిర్ణయించి తెలియజేయడం జరుగుతుందన్నారు. ఈ వేలంపాటలో జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి  బివి రమణ, ముధోల్ వ్యవసాయ సహాయ సంచాలకులు శ్రీనివాసరాజు, ముధోల్ ఇన్చార్జి ఎంపీడీవో అశోక్ , భైంసా ఉద్యాన అధికారి షేక్ జావిద్ పాష , ముధోల్ మండల వ్యవసాయ అధికారిని రచన  ముద్గల్ గ్రామ సర్పంచ్ అనురాధ , ఉప సర్పంచ్ గోపాల్ , హెచ్ఈఓ మోయిన్ మియా, వేలంపాట దారులు ,పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -