- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణించిన నేపథ్యంలో నగరంలో రిజిస్టర్ కాని, BS-VI నిబంధనలకు అనుగుణంగా లేని కమర్షియల్ వెహికల్స్‌పై ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ నిషేదం విధించింది. నేటి నుంచి వాటికి నగరంలోకి అనుమతి ఉండదు. దీని నుంచి BS-IV వాణిజ్య వాహనాలకు 2026, OCT 31 వరకు మినహాయించింది. ఢిల్లీ రిజిస్టర్డ్ కమర్షియల్ గూడ్స్ వెహికల్స్, BS-VI, CNG/LNG, ఎలక్ట్రికల్ కమర్షియల్ వాహనాలకు అనుమతి ఉంటుంది.
- Advertisement -



