మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద కోన వెంకట్ నిర్మించిన చిత్రం ‘బ్యాండ్ మేళం’. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హర్ష్ రోషన్, శ్రీదేవీ జంటగా నటించారు.
ఈ మూవీని మార్చి 13న రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర గ్లింప్స్‌ని వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. దర్శకుడు త్రివిక్రమ్ ఈ గ్లింప్స్‌ని సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.
గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌కి దర్శకుడు బాబీ, రచయిత బీవీఎస్ రవి ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ, ‘ఈ గ్లింప్స్‌ని వాలెంటైన్స్ డేకి రిలీజ్ చేయండి అని నేను ఒత్తిడి చేశాను. గ్లింప్స్ చూసిన వెంటనే రోషన్ నెంబర్ కనుక్కుని ఫోన్ చేసి మాట్లాడాను. ఫ్యూచర్‌లో రోషన్ పెద్ద స్టార్ అవుతాడు. ఎంతో కూల్‌గా నటించేశాడు. శ్రీదేవీ అద్భుతంగా నటించింది. సతీష్ జవ్వాజీ చూస్తే సైలెంట్‌గా ఉంటాడు కానీ మంచి సెటైర్లు వేస్తుంటాడు. ఈ చిత్రం కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ సినిమా తరువాత మగాళ్ల మెడల్లో తాళిబొట్టు కనిపిస్తుందేమో అని కంగారు పడుతున్నాను. ఆయన రైటింగ్, కన్విక్షన్ అన్నీ కూడా అక్కడే అర్థం అవుతున్నాయి. కోనకి డబ్బులు వస్తే మాకు డబ్బులు వచ్చినట్టే. ‘నిన్ను కోరి’ టైంలో ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడో మళ్లీ ఇప్పుడు అంతే కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ సినిమా చాలా పెద్ద స్థాయిలో సౌండ్ చేస్తుంది’ అని అన్నారు. ”నిన్ను కోరి’ లాంటి సక్సెస్ ఫీలింగే సతీష్ జవ్వాజీ ఈ కథ చెప్పినప్పుడు అనిపించింది. నేనేమీ రెగ్యులర్ ప్రొడ్యూసర్‌ని కాదు. మనసుకి నచ్చిన కథ వస్తేనే సినిమాని తీస్తాను. ఈ కథ విన్నప్పుడే నాకు రోషన్, శ్రీదేవీ కనిపించారు. ఆ ఇద్దరినీ ఒప్పిస్తేనే సినిమా తీస్తాను అని సతీష్‌కి చెప్పాను. నా జీవితంలో బీవీఎస్ రవి, బాబీ చాలా ఇంపార్టెంట్. జీవితాంతం గుర్తుండిపోయే సినిమాగా ‘బ్యాండ్ మేళం’ నిలుస్తుంది’ అని నిర్మాత కోన వెంకట్ చెప్పారు.
యూనిక్ కాన్సెప్ట్‌తో ‘బ్యాండ్ మేళం’
- Advertisement -
- Advertisement -



