Wednesday, May 14, 2025
Homeతెలంగాణ రౌండప్కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ కమిటి డైరెక్టర్ గా బండారి నర్సింగరావు

కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ కమిటి డైరెక్టర్ గా బండారి నర్సింగరావు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు: దక్షణ కాశీగా పెరుగాంచిన కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ పాలకవర్గాన్ని ఎట్టకేలకు బుధవారం నియమించి, ఆలయ ఈఓ శనిగల మహేష్ ఆధ్వర్యంలో ప్రమాణస్వీకారం చేశారు. మండలంలోని పెద్దతూండ్ల గ్రామానికి చెందిన బండారి నర్సింగరావు కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ డైరెక్టర్ గా బుధవారం ప్రామాణస్వీకారం చేశారు. తనపై నమ్మకంతో ఆలయ డైరెక్టర్ పదవి అప్పజెప్పిన రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు లకు నర్సింగరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బాధ్యతలు చేపట్టిన నర్సింగరావును మాజీ ఎంపిపి చింతలపల్లి మలహర్ రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య, యూత్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్, రాజు నాయక్, కిషన్ నాయక్, జంబోజు రవి తదితరులు ఘనంగా శాలువాలతో సత్కరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -