బంద్ ప్రశాంతం..

Bandh is calm..నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి,ఇందల్ వాయి మండలాల్లో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా డిచ్ పల్లి,ఇందల్ వాయి బంద్ కు విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దల్ హిందూ సంఘాలు బంద్ కి పిలుపు ఇచ్చారు.తేరిచిన దుకాణ దారులకు, షోరూమ్ లను బంద్ చేయించారు. ఈ కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి వారు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రవి వినోద్ రెడ్డి, మహేందర్ ,విజయ్, వినోద్, ఉత్తేజ్, తదితర నాయకులు పాల్గొన్నారు.
Spread the love