Friday, October 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పరకాల పట్టణంలో బంద్ విజయవంతం 

పరకాల పట్టణంలో బంద్ విజయవంతం 

- Advertisement -

ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ 
నవతెలంగాణ – పరకాల 

ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పరకాల పట్టణంలో విద్యా సంస్థల బంద్ విజయవంతం చేయడం జరిగింది. ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ జిల్లా కమిటీ సభ్యుడు మడికొండ ప్రశాంత్ మాట్లాడుతూ .. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని గురువారం పరకాల పట్టణంలో ఉన్న డిగ్రీ పీజీ ఇంటర్మీడియట్ కాలేజీలను బందు చేయడం జరిగిందన్నారు.

ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ స్కాలర్షిప్లను ఫీజు రియంబర్స్మెంట్ లను వెంటనే విడుదల చేయాలని అన్నారు. కళాశాలలో కోర్సు అయిపోయిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వకుండ యజమాన్యం విద్యార్థులను తీవ్రమైన ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పరకాల పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్, జిల్లా కమిటీ సభ్యుడు బొజ్జ హేమంత్ పట్టణ ఉపాధ్యక్షుడు యశ్వంత్ పట్టణ సహాయ కార్యదర్శి అరుణ్ చంటి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -