ఎంబీబీఎస్ సిటు సాధించిన గ్రామీణ వైద్యుడి కూతురు
నవతెలంగాణ-మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన బండి సుధాకర్-సరితా దంపతుల కూతురు బండి కీర్తి ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన నిట్ పరీక్షలో ఎంబిబిఎస్ సిటు సాధించింది.కీర్తి మొదటి నుంచి ఎలాగైనా వైద్య వృత్తి చేపట్టాలనే మక్కువతో చదువుపై శ్రద్ధ వహించి నిట్ లో మెరిసిన ముత్యంలా,మట్టిలో మాణిక్యంలా దూసుకపోయి అనుకున్న లక్ష్యాన్ని ఎంచుకొని ఇటు తల్లిదండ్రులు,అటు విద్య నేర్పిన గురువులకు మంచి పేరు తీసుకొచ్చింది. ఎంబీబీఎస్ సిటు సాధించడంపై ఆమెను పలువురు అభినందించారు.కీర్తి ప్రాథమిక విద్యను తాడిచెర్ల మన్నెగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పూర్తి చేసి 6,7 తరగతులు కాటారం మండలం దామెరకుంటలోని (టి.ఎస్.డబ్ల్యూ.ఆర్ ఎస్.జి) సోషల్ వెల్పేర్ ప్రభుత్వ పాఠశాలలో,8 నుంచి 10వ తరగతి వరకు (టి.డబ్ల్యూ.ఆర్.ఎస్.జి.సిఓఈ) సోషల్ వెల్పేర్ ఆల్గునుర్ కరీంనగర్ లో ఇంటర్మీడియట్ బైపిసి గ్రూపు (టి.డబ్ల్యూ.ఆర్.ఎస్.జి.సిఓఈ)సోషల్ వెల్పేర్ గాలిదొడ్డి..రంగారెడ్డి జిల్లాలో పూర్తి చేసింది.ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన నిట్ పరిక్షలో తెలంగాణ రాష్ట్ర స్థాయిలో 7,160 ర్యాంక్,ఆల్ ఇండియాలో 2,71,204 ర్యాంక్ రాగా, క్యాటగిరి ర్యాంక్ 20 వేలు సాధించి మహేశ్వర మేడికల్ కాలేజీ ఉమ్మడి మెదక్ జిల్లాలో సిటు సాధించింది.అయితే తల్లిదండ్రులు పేద కుటుంబానికి చెందిన వారు కావడంతో కాలేజి పిజులు,స్టడీ మెటీరియల్స్ కొనుగోలు చేసే పరిస్థితిలో లేకపోవడంతో దయనియులైన దాతలు,స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి తమకు తోచిన సాయం చేయాలని గ్రామీణ వైద్యుడి దంపతులు వేడుకొన్నారు.



