కోల్‌కత థండర్‌బోల్ట్స్‌పై గెలుపు
ప్రైమ్ వాలీబాల్ లీగ్ సీజన్ 4
హైదరాబాద్: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్)4వ సీజన్‌లో బెంగళూరు టార్పెడోస్ మరోసారి అద్భుతమైన పునరాగమనంతో ఆకట్టుకుంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన హౌరాహౌరీ మ్యాచ్‌లో తొలి సెట్ కోల్పోయినప్పటికీ పుంజుకున్న బెంగళూరు 3%-%1 (11-15, 15-13, 15-11, 15-11) తేడాతో కోల్‌కతా థండర్‌బోల్ట్స్‌పై మెరుపు విజయం సాధించింది. ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో బెంగళూర్ వరుసగా రెండో విజయం ఖాతాలో వేసుకుంది. ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన జోయెల్ బెంజమిన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. తొలి సెట్లో బెంగళూర్ తడబాటుకు గురైనా.. ఆ తర్వాత వరుసగా మూడు సెట్లలో గొప్పగా పుంజుకుంది. నాలుగు సెట్ల థ్రిల్లర్‌లో 3-1తో బెంగళూర్ టార్పెడోస్ గెలుపొందింది.
బెంగళూర్ టార్పెడోస్ జోరు
- Advertisement -
- Advertisement -