Wednesday, August 20, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్బంగారు సాయిలుకు అంతర్జాతీయ అంబేద్కర్ అవార్డు

బంగారు సాయిలుకు అంతర్జాతీయ అంబేద్కర్ అవార్డు

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
జిల్లా వాసి,సామాజిక సేవా కార్యకర్త బంగారు సాయిలు కు అమెరికా దేశానికి చెందిన యూనివర్సిటీ ఆఫ్ టోలోసా వారు అంతర్జాతీయ అంబేద్కర్ అవార్డును బహుకరించారు. ఈ మేరకు బుధవారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బంగారు సాయిలు మాట్లాడుతూ.. తాను చేసిన సేవలను గుర్తించి టోలోసా యూనివర్సిటీ వారు అంబేద్కర్ పేరిట ఉన్న అంతర్జాతీయ అవార్డును అందించడం ఆనందం కలిగిస్తుంది అన్నారు.

ఈ అవార్డు రావడంతో మరింత బాధ్యతలు పెరిగాయాన్నారు. జిజి కాలేజీలో ఎన్ఎస్ఎస్ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి నేటి వరకు తాను చేసిన సేవల పేపర్ కటింగ్ లను యూనివర్సిటీ ఆఫ్ టోలోసా కు పంపడంతో తనకు ఈ గుర్తింపు లభించింది అన్నారు. జిల్లాలో ఈ అవార్డు సాధించిన వ్యక్తిని తాను ఒక్కడినేనని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కోనేరు సాయికుమార్, అశోక్, షేక్ హుస్సేన్, పింకీ, కేశ్ పల్లి రవి, సక్కి ప్రభంజన్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad