Thursday, February 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలుబంగ్లాదేశ్‌లో ముగిసిన పోలింగ్‌..కౌంటింగ్ షురూ

బంగ్లాదేశ్‌లో ముగిసిన పోలింగ్‌..కౌంటింగ్ షురూ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియ‌గా కౌంటింగ్ షురూ అయింది.. ఈరోజు మధ్యాహ్నానికి 47.91 శాతం పోలింగ్‌ జరుగినట్లు ఆ దేశ‌ ఎన్నికల సంఘం తెలిపింది. మొత్తం 299 పార్లమెంట్ స్థానాలకు ఉదయం 7:30 గంటలకు ఓటింగ్ ప్రారంభ‌మై… సాయంత్రం 4:30 గంటల వరకు పోలింగ్ జ‌రిగింది. అభ్యర్థి మరణంతో ఒక స్థానంలో పోలింగ్ నిలిపివేశారు. 5 లక్షల మంది సిబ్బంది పేపర్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. గురువారం రాత్రికి ఫలితాలు వెలువడనున్నాయి.

అయితే అధికారులు ఊహించినవిధంగానే పోలింగ్‌ సమయంలో అక్కడ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఖుల్నా 2 నియోజకవర్గంలో జమాత్‌ నాయకులు, కార్యకర్తలు జరిపిన దాడిలో బీఎన్‌పీ నాయకుడు మోహిబజ్జమాన్‌ కొచ్చి మృతి చెందారు. బంగ్లాదేశ్‌ ఎన్నికల చరిత్రలో.. పోలింగ్‌ సమయంలో ప్రాణ నష్టం జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 1 మిలియన్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు.

డైలీ స్టార్ ప్రకారం.. మొత్తం 2034 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయ‌గా 51 పార్టీలు బ‌రిలోకి దిగాయి. ప్ర‌ధానంగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP), జమాత్-ఇ-ఇస్లామీ, నేషనల్ సిటిజన్ పార్టీ (NCP), నేషనల్ పార్టీ (JP-క్వాడర్), జాతీయ పార్టీ (JP-ఎర్షాద్), బంగ్లాదేశ్ (JP-ఎర్షాద్ పార్టీ). మిత్రపక్షం (JP-ఎర్షాద్) పార్టీల మ‌ధ్య పోటీ నెల‌కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -