Thursday, September 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శిక్షణా ఆనంతరం బ్యాంకు రుణాలు పొందవచ్చు..

శిక్షణా ఆనంతరం బ్యాంకు రుణాలు పొందవచ్చు..

- Advertisement -

ఏజీఎం ఏవో రంజిత్ కుమార్ నాయుడు..
నవతెలంగాణ – డిచ్ పల్లి

స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డిచ్ పల్లి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణా ఆనంతరం బ్యాంకు రుణాలు  పొందవచ్చని ఎజియం .ఏవో నిజామాబాద్ రంజిత్ కుమార్ నాయుడు పేర్కొన్నారు. గురువారం ఆర్ ఎస్ఈ టిఐ ని సందర్శించి  జరుగుతున్న మూడు శిక్షణ కార్యక్రమాలు లను దీపారాధన చేసి ప్రారంభించారు. అనంతరం ఏజీఎం  మాట్లాడుతూ మహిళలకు  టైలర్, మగ్గం, బ్యూటీ పార్లర్ అనేవి చాలా ఉపయోగకరమైన శిక్షణలు అని, ఈ శిక్షణా తీసుకున్న వారు బయటకు వెళ్ళక మంచి అవకాశాలు ఉంటాయన్నారు. ముఖ్యంగా మహిళలు ఈరోజుల్లో వేసుకునే డ్రెస్ లకు అందానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారని ఎంత ఖర్చు చేసైన అందంగా కనపడానికి వెనుకడటం లేదన్నారు. అర్ఎస్ఈటిఐ  ద్వారా ఇలాంటి కార్యక్రమాలు నిర్వర్తించడం అభినందన మన్నారు. శిక్షణా ఆనంతరం బ్యాంకు రుణాలు పొందవచ్చని సూచించారు. సంస్థ డైరెక్టర్ రవికుమార్ సిబ్బంది ని అభినందించారు. ఈ కార్యక్రమంలో లో సిబ్బంది రామకృష్ణ, నవీన్, లక్ష్మణ్, ఫరీదా, సుజాత పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -