Thursday, February 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బ్యాంకు రుణాలు సద్వినియోగం చేసుకోవాలి 

బ్యాంకు రుణాలు సద్వినియోగం చేసుకోవాలి 

- Advertisement -

రూ.3000 భీమ  చేస్తే 60 లక్షల ఇన్సూరెన్స్ : మేనేజర్ కృష్ణమూర్తి 
నవతెలంగాణ – మిడ్జిల్ 

గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రజలు బ్యాంకు రుణాలు సద్వినియోగం చేసుకోవాలని, తీసుకున్న అప్పు సకాలంలో చెల్లిస్తే బ్యాంకులు లాభాలలోకి వస్తాయని  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సంగమేశ్వర గ్రామీణ వికాస్ బ్యాంక్ మేనేజర్ కృష్ణమూర్తి అన్నారు. ఆర్థిక సాంకేతిక అక్షరాస్యత సదస్సు కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని వాడియాల గ్రామంలో సర్పంచ్ చంద్రయ్య గౌడ్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశంలో మేనేజర్ కృష్ణమూర్తి మాట్లాడారు. బ్యాంకు ఖాతా ఉన్న ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ బీమా చేయించుకోవాలని సూచించారు.

ప్రమాదవశాత్తు, రోడ్డు ప్రమాదంలో పాము కాటుకు, యాక్సిడెంట్ తో మరణిస్తే వెయ్యి రూపాయలు బీమా చెల్లిస్తే రూ.20 లక్షలు, రూ.3000 బీమా కడితే రూ.60 లక్షల ఇన్సూరెన్స్ ఖాతాదారులకు కుటుంబాలకు వస్తుందని ఇన్సూరెన్స్ కుటుంబానికి  భరోసా ఇస్తుందని చెప్పారు. సైబర్ నేరాలకు మోసపోవద్దని బ్యాంకు నుండి ఫోను చేసి మాట్లాడితే ఓటీపీలు అకౌంట్ నెంబర్లు చెప్పవద్దని బ్యాంకు అధికారులు ఎప్పుడు కూడా ఖాతాదారులకు ఫోను చేయరాని సూచించారు.

మహిళా సంఘాలకు ప్రభుత్వము రుణాలు మంజూరు చేస్తుందని, సంఘంలో ఉన్న సభ్యులందరూ బ్యాంకు రుణాలు సకాలంలో చెల్లిస్తేనే సంఘాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. సురక్షత భీమా, అటల్ యోజన పెన్షన్, పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సర్పంచ్ చంద్రయ్య గౌడ్ మాట్లాడుతూ, ప్రభుత్వాలు తీసుకొస్తున్న పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బ్యాంకుకు వచ్చే ఖాతాదారులకు ఇబ్బందులకు లేకుండా సకాలంలో రుణాలు మంజూరు చేయాలని చెప్పారు.

అంతకుముందుకు బ్యాంకుల లావాదేవులపై కళాకారుల చేత ఆటపాటలతోటి మహిళలకు, రైతులకు పాటల ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నాగరాజు, ఫీల్డ్ ఆఫీసర్ రమేష్ సిబ్బంది బాలయ్య, మాజీ సర్పంచ్ వెంకటేష్ గౌడ్, మహిళా సంఘ సభ్యులు పుష్పలత, యాదమ్మ, మరియమ్మ, కల్పన, వార్డు మెంబర్లు ఉదయ్ కుమార్, దశరథం, రైతులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -