Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంనకిలీ పాస్‌పుస్తకాలతో బ్యాంకులకు కుచ్చుటోపీ

నకిలీ పాస్‌పుస్తకాలతో బ్యాంకులకు కుచ్చుటోపీ

- Advertisement -

– ముగ్గురు అరెస్ట్‌
– వివరాలు వెల్లడించిన మహబూబాబాద్‌ డీఎస్పీ తిరుపతిరావు


నవతెలంగాణ-మహబూబాబాద్‌
నకిలీ పాస్‌ పుస్తకాలతో రుణాలు తీసుకుని బ్యాంకులకు కుచ్చుటోపీ పెడుతున్న ముఠాలోని ముగ్గురిని కురవి పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి వివరాలను శుక్రవారం మహబూబాబాద్‌ జిల్లా కురవి పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ తిరుపతిరావు వెల్లడించారు. కురవికి చెందిన మూడు బాలాజీ, మహబూబాబాద్‌ మండలం ఆమనగల్లుకు చెందిన భాను హరికిషన్‌, జఫర్‌గడ్‌కు చెందిన బానోతు వర్ణన్‌ ముఠాగా ఏర్పడి నకిలీ పాస్‌ పుస్తకాలు తయారు చేశారు. ఈ ముగ్గురు మరికొందరి సహకారంతో నకిలీ పాస్‌ పుస్తకాల దందాకు తెరలేపారు. కురవి మండలంలో కొంతమంది రైతులను మభ్యపెట్టి ”మీకు ఎక్కువ లోన్‌ ఇప్పిస్తామని, దానికి ఖర్చు అవుతుందని” చెప్పి, వారి పేరుతో ఒక్కో పాస్‌ బుక్కుకి రూ.10,000 వసూలు చేసి నకిలీ పుస్తకాలు సృష్టించారు. వ్యవహారం అంతా వాళ్లే చూసుకునే ఒప్పందంతో.. నకిలీ పాస్‌ పుస్తకాల ద్వారా కురవి మండల కేంద్రంలోని యూనియన్‌ బ్యాంకులో ఒకరికి, డోర్నకల్‌ యూనియన్‌ బ్యాంకులో ఆరుగురికి, మహబూబాబాద్‌ యూనియన్‌ బ్యాంకులో ఒకరికి, మహబూబాబాద్‌ కెనరా బ్యాంకులో ముగ్గురికి రూ.16,90,000/- చొప్పున లోన్‌ ఇప్పించారు. కురవి యూనియన్‌ బ్యాంకులో మరికొంత మందికి అక్రమ పద్ధతిలో లోన్‌లు ఇప్పించాలనే ఆలోచనతో ఆ ముఠా సభ్యులు మండల కేంద్రానికి వచ్చారు. నకిలీ పాస్‌పుస్తకాలు, 1బీ, ఈసీలు తయారు చేసే పనిలో ఉండగా పక్కా సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠాకు చెందిన మరికొంత మంది పరారీలో ఉన్నారు. ఏఏ బ్యాంకుల నుంచి ఎంత మొత్తంలో రుణాలు తీసుకున్నారో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎవరెవరు ఇలా లోన్‌ తీసుకున్నారో వారిని కూడా అరెస్టు చేస్తామని డీఎస్పీ తెలిపారు. నిందితులు ముగ్గురి నుంచి 23 నకిలీ పాస్‌ పుస్తకాలు, లాప్‌టాప్‌, కంప్యూటర్‌, రెండు ప్రింటర్‌లు, మూడు సెల్‌ ఫోన్‌లు సీజ్‌ చేసినట్టు చెప్పారు. ఈ సమావేశంలో రూరల్‌ సీఐ సర్వయ్య, కురవి ఎస్‌ఐ సతీష్‌ పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad