8,9 తేదీల్లో తెలంగాణ రైజింగ్-2047 ఉత్సవాలు
ప్రభుత్వ పాలసీలు ప్రకటిస్తాం
బ్యాంకర్లు భాగస్వాములు కావాలి : ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ రైజింగ్-2047 ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున ఈనెల ఎనిమిది, తొమ్మిది తేదీల్లో నిర్వహించబోతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. అన్ని రకాల ప్రభుత్వ పాలసీలను ప్రకటిస్తా మని చెప్పారు. ఈ భారీ కార్యక్రమంలో బ్యాంకర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని భాగస్వా ములు కావాలని కోరారు. మంగళవారం హైదరాబాద్‌లోని బేగంపేటలో ఓ ప్రయివేటు హోటల్‌లో నిర్వహించిన ఎస్‌ఎల్‌బీసీ 47వ త్రైమాషిక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా 13 శాతం జీడీపీ పెరుగుదల టార్గెట్‌గా తెలంగాణ రైజింగ్-2047 రోడ్ మ్యాప్‌ను విడుదల చేయబోతున్నట్టు వివరించారు. ఏటా 10 శాతం చొప్పున పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన విద్యుత్ సరఫరా లక్ష్యాన్ని సాధిస్తామని అన్నారు. తెలంగాణ అభివృద్ధి పట్ల ప్రభుత్వ కల ఏంటి, దాన్ని సాధించేందుకు ఎలాంటి ప్రణాళికలతో ముందుకు పోతున్నామనేది ఈ ఉత్సవంలో వివరిస్తామన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం, ఔటర్ రింగ్ రోడ్డుకు దాన్ని కలు పుతూ అనేక పారిశ్రామిక కారిడార్ల నిర్మాణం, మూసీ పునర్జీవనం వంటి అంశాలను వివరించి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పెట్టుబ డిదారులను పెద్దఎత్తున ఆకర్షించ బోతున్నా మని చెప్పారు. బ్యాంకర్లు కార్పొరేట్ సంస్థల తోపాటు స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ), సూక్ష్మ మధ్యతరహా, చిన్న పరిశ్ర మలకు ప్రోత్సాహం అందించాలని కోరారు. ఈ రెండు రంగాలను ప్రోత్సహిం చడం ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి లభించ డంతోపాటు సంపద సృష్టించ బడుతుందనీ, తద్వారా జీడీపీ పెరుగుతుందని అన్నారు.
డిజిటల్ విద్య అందించడమే లక్ష్యం
విద్య, వైద్య రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని భట్టి చెప్పారు. బ్యాంకర్లు సీఎస్‌ఆర్ నిధులను సీఎస్ మొదలు కలెక్టర్ వరకు, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిని సంప్రదించి ఈ రంగాల్లో ఆ నిధులను ఖర్చు చేయాలని సూచించారు. విద్యను ప్రోత్సహిం చేందుకు మౌలిక సదుపాయాలు కల్పించడం తోపాటు, డిజిటలైజ్ ఎడ్యుకేషన్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతుందని వివరించారు. వ్యవసాయ మౌలిక వసతుల నిధి కింద మంచి పురోగతి సాధించామన్నారు. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిజంగా మార్పు చేయాలంటే పంట కోత తర్వాతి మౌలిక సదుపాయాలు, ప్రాసెసింగ్ యూని ట్లు, సూక్ష్మ పంట నీరు, అనుబంధ రంగాల్లో బ్యాంకు రుణాలను మరింతగా పెంచాలని కోరారు. పంట రుణాలు సమర్థవంతంగా అందుతున్నప్పటికీ, వ్యవసాయ టర్మ్ లెండింగ్ అవసరానికి తగ్గట్టు లేదన్నారు. ఇది రైతులు ఆధునీకరించుకోవడం, వైవిధ్యం చేర్చు కోవడం, ఆత్మనిర్భర స్థాయి నుంచి సంపన్న స్థాయికి చేరడం సహాయపడదని చెప్పారు. ఈ లోటును బ్యాంకులు అత్యవసరంగా భర్తీ చేయాలని కోరారు. రూ. రెండు లక్షల వరకు పంట రుణ మాఫీ, రైతు భరోసా, సాగునీటి ప్రాజెక్టులు, ఉచిత విద్యుత్ అందించామని వివరించారు. పామాయిల్‌తోపాటు ఇతర విభిన్న పంటలకు బ్యాంకులు ఎక్కువ మద్దతు ఇవ్వాలని సూచించారు. ఎంఎస్‌ఎంఈలు రాష్ట్రంలో ఉపాధి, ఆవిష్కరణలకు వెన్నెముకగా నిలుస్తున్నాయని చెప్పారు. భరోసాతో కూడిన, బలమైన ఎంఎస్‌ఎంఈ వ్యవస్థ వచ్చే దశాబ్దం తెలంగాణ రైజింగ్‌కు పునాది అని అన్నారు. 13 వేల కిలోమీటర్ల అంతర్గత రహదారుల నిర్మాణం, ఒక రూపాంతరక కార్యక్రమం ప్రస్తుతం జరుగుతోందనీ, ఇది రాష్ట్ర ఆర్థిక పటాన్ని సమూలంగా మారుస్తుందని చెప్పారు. దీన్ని బ్యాంకులు ప్రాధాన్య రంగ రుణ అవకాశంగా చూడాలని కోరారు. తెలంగాణ అభివృద్ధిలో బ్యాంకులు మరింత బలమైన పాత్ర వహించాలని సూచించారు. ఆత్మవిశ్వాసం, సమిష్టి కర్తవ్యంతో ఒక ఆధునిక, సమగ్ర, భవిష్యత్ తెలంగాణను నిర్మిద్దామని భట్టి పిలుపునిచ్చారు. తదుపరి దశాబ్దాన్ని తెలంగాణ చరిత్రలో అత్యంత రూపాంతరక కాలంగా మలుద్దామని అన్నారు.
రాష్ట్రాభివృద్ధిలో బ్యాంకులు బలమైన పాత్ర పోషించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



