నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో శ్రీ బాపూజీ రజక సహకార సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో సంఘం సభ్యులందరూ ఐక్యంగా పాల్గొని కొత్త నాయకత్వాన్ని ఎంపిక చేశారు.
సంఘం అధ్యక్షుడిగా మామిడాల బాలమల్లేష్‌ను ఎన్నుకోగా, ఉపాధ్యక్షులుగా మామిడాల అంజయ్య, మామిడాల భాస్కర్ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా మామిడాల బాబు, కార్యదర్శిగా మామిడాల భానుచందర్ బాధ్యతలు స్వీకరించనున్నారు. కోశాధికారిగా మామిడాల సాగర్, సహాయ కార్యదర్శిగా ఎదునూరి భాస్కర్ ఎంపికయ్యారు.
కుల పెద్దమనుషులుగా మామిడాల సోమరాజు, బండి బాలరాజు నియమితులయ్యారు. డైరెక్టర్లుగా నిమ్మల రాజయ్య, బండి శంకర్, గజం సాయిలు, మామిడాల శంకర్, మామిడాల అంజయ్య, మామిడాల భానుచందర్, జీడిగారి నాగరాజు, మామిడాల మల్లేష్, మామిడాల యాదగిరి, రేణికుంట అంజయ్య, అమ్మగారి బాలయ్య, ఎదునూరి భాస్కర్, కలకోటి నర్సింహులు, మామిడాల గణేష్, మామిడాల భాస్కర్‌లను ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో సంఘం మాజీ అధ్యక్షులు మామిడాల నర్సింహులు, మామిడాల సోమయ్య, మామిడాల అంజయ్య, మామిడాల బిక్షపతి, మామిడాల మైసయ్య తదితరులు పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.



