Monday, November 10, 2025
E-PAPER
Homeకరీంనగర్ఉత్తమ సేవా అవార్డు గ్రహీత సాయి వర్మకు బార్ అసోసియేషన్ ఘన సన్మానం..

ఉత్తమ సేవా అవార్డు గ్రహీత సాయి వర్మకు బార్ అసోసియేషన్ ఘన సన్మానం..

- Advertisement -

నవతెలంగాణ వేములవాడ 
వేములవాడ రూరల్ మండలం నమిలిగుండుపల్లె గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వంగపల్లి మల్లేశం కుమారుడు వంగపల్లి మని సాయి వర్మకు సోమవారం వేములవాడ బార్ అసోసియేషన్ ఘన సన్మానం అందించింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఉత్తమ సేవా అవార్డు అందుకున్న సాయి వర్మను బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిసె సదానందం శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా సదానందం మాట్లాడుతూ.. సాయి వర్మ 2019–2023 సంవత్సరాల్లో సీఎంఆర్ కాలేజీలో బీటెక్ చదువుతున్న సమయంలో విద్యార్థి సంఘం తరపున సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహించారని, తెలంగాణ రాష్ట్రం తరఫున అవార్డు అందుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. యువత సామాజిక సేవా భావంతో ముందుకు సాగితే దేశ భవిష్యత్తు బలపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణ రెడ్డి తో పాటు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -