నవతెలంగాణ-హైదరాబాద్ : నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బార్ల లైసెన్స్ లాటరీ ఉండనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బార్ల లైసెన్స్ దరఖాస్తు గడువు నిన్న రాత్రి 10 గంటలకు ముగిసిన సంగతి తెలిసిందే. కొత్త బార్ పాలసీ ప్రకారం మినిమం 4 దరఖాస్తులు వచ్చిన వాటికే లాటరీ తీయబోతున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం 840 బార్లలో 367 బార్లకే నాలుగు కంటే ఎక్కువ అప్లికేషన్ రావడం జరిగింది.
దీంతో వాటికే ఇవాళ లాటరీ తీయబోతున్నారు. అటు మిగిలిన 473 బార్లకు మినిమం దరఖాస్తులు వచ్చే వరకు ఎక్సైజ్ శాఖ… నోటిఫికేషన్లు ఇవ్వనుంది. కాగా నేడు కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. ఇవాళ ఉదయం 11.00 గంటలకు పరమ సముద్రం చెరువు వద్ద జల హారతి ఇవ్వనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. 11.15 గంటలకు పరమ సముద్రం చెరువు పక్కనే సీఎం చంద్రబాబు బహిరంగ సభ లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు పారిశ్రామికవేత్తలతో అవగాహనా ఒప్పందాలు ఉంటాయి.