Tuesday, May 6, 2025
Homeతెలంగాణ రౌండప్హైకోర్టు న్యాయమూర్తికి బార్ నివాళి

హైకోర్టు న్యాయమూర్తికి బార్ నివాళి

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని మృతికి నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఘనంగా నివాళులర్పించింది. జస్టిస్ ప్రియదర్శిని అనారోగ్యంతో హైదరాబాద్ లో మృతి చెందిన విషయం విదితమే. జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశపు హల్ లో బార్ ఉపాధ్యక్షుడు దిలీప్ అధ్యక్షత జరిగిన సంతాప సమావేశంలో జస్టిస్ ప్రియదర్శిని జీవనాన్ని వివరించారు. మహిళల సాధికారతలో ఉన్నత స్థానానికి చేరుకున్న ఆమె ఎంతో జీవితం ఉన్న మృత్యువు పాలుకావడం దృరదృష్టకరమని ఆయన అన్నారు. అనంతరం బార్ ప్రధాన కార్యదర్శి మానిక్ రాజు కామారెడ్డి బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది మోహన్ రావు కులకర్ణి అకాల మృతి విషాదకరమని అన్నారు. కామారెడ్డి, నిజామాబాద్ కోర్టులలో న్యాయవాద వృత్తిలో ఉంటు అందరి మన్ననలు పొందారని తెలిపారు. సమావేశంలో బార్ కోశాధికారి నారాయణ దాసు, న్యాయవాదులుసంగమేశ్వర్ రావు, కిరణ్ కుమార్ గౌడ్,చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదార్ న్యాయమూర్తి, న్యాయవాది ల వృత్తి జీవనగమనాన్ని యువ న్యాయవాదులు స్ఫూర్తిగా తీసుకుని ఎదగాలని అన్నారు. అనంతరం న్యాయవాదులు ఇద్దరి మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -