Wednesday, October 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వైన్ షాపులకు బేరసారాలు.!

వైన్ షాపులకు బేరసారాలు.!

- Advertisement -

లక్కీ డ్రాలో షాపు పొందిన వారి నుంచి కొనుగోలుకు ప్రయత్నాల
నవతెలంగాణ – మల్హర్ రావు

మద్యం దుకాణాల కేటాయింపు పూర్తికావడంతో..వ్యాపారుల బేరసారాలు మొదలయ్యాయి. నజరానా ఇస్తాం..షాపు ఇస్తారా.. అంటూ లక్కీ డ్రాలో మద్యం షాపులు దక్కిన వారిని వ్యాపారులు ప్రలోభపెడుతున్నారు.ఆయా ప్రాంతాల్లో డిమాండ్ను బట్టి నజరానా ఇచ్చేందుకు చర్చలు జరుపుతున్నారు. అయితే లక్కీ డ్రాలో షాపులు దక్కించుకున్న వారంతా మంగళవారం ఆయా షాపుల రెంటల్ రేటు ఆధారంగా 1/6వ వంతు డబ్బులు చెల్లించారు. దాని ద్వారా ప్రభుత్వానికి రూ.15 కోట్ల వరకు ఆదాయం సమకూరింది.టెండర్ల ప్రక్రియ ముగియడంతో డిసెంబర్ 1 నుంచి వెన్స్ షాపులు తెరిచేందుకు వ్యాపారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

వైన్ షాపుల కోసం ఈసారి పోటీ తక్కువగా ఉంది. దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలకు పెంచడంతో వ్యాపారులు ఎక్కువగా సిండికేట్గా ఏర్పడి టెండర్లు వేశా రు. కానీ అనుకున్న స్థాయిలో వారికి షాపులు దక్క లేదు. మద్యం వ్యాపారంతో సంబంధం లేని వారికి ఎక్కువ శాతం షాపులు దక్కాయి. దీంతో వారి నుంచి దుకాణాలు కొనేందుకు సిద్ధమవుతున్నారు.

నిబంధనల ప్రకారం ఉంటేనే లైసెన్స్..

ప్రస్తుత మద్యం పాలసీ నవంబర్ నెలతో ముగియనుంది. 2025 -27కు సంబంధించి కొత్త మద్యం దుకాణాలు డిసెంబర్ 1వ తేదీనుంచి ప్రారంభమ వుతాయి. అయితే వైన్స్ షాపులు దక్కించుకున్న వారు ఎక్కడ షాపు ఏర్పాటు చేస్తారు.. ఏ పేరున షాపు పెడతారు..తదితర వివరాలను ఎక్సైజ్ శాఖ అధికారులకు సమర్పించాలి. వైన్ షాపు గుడి, బడి, ఆసుపత్రికి 100 మీటర్ల దూరంలో ఉండా,లేదా..నిబంధనల ప్రకారం ఏర్పాటు చేస్తున్నారా లేదని అనే విషయాలను అధికారులు పరిశీలించి అన్నీ సవ్యంగా ఉంటే.. ఆ స్థలంలో వైన్ షాపు పెట్టుకు నేందుకు లైసెన్స్ జారీ చేస్తారు. డిసెంబర్ 1 నుంచి కొత్త వైన్ షాపులు ప్రారంభిస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -