మానవ వికాసం వద్ధిచెందినా కొద్దీ సమాజంలో అసమానతలు పెరిగి సంక్లిష్టంగా మారుతుంది. సజన అనేది సమత, ఏకత ఆధునికలక్ష్యం. ‘ఇంచుక సత్యమైన కల్పితప్రబంధము కథ. రూపసారాన్ని బట్టి కథలు రెండురకాలు. వాస్తవికత, జీవితనుభావాలు కథాసంబంధమైనవిగా, కల్పితాంశం ప్రధానంగా ఉండేది కథన సంబంధిగా ఉంటుంది. ప్రపంచ కథకు పుట్టినిల్లు తెలంగాణ. తెలుగు కథకు పురిటిగడ్డ కథల కొండ నల్లగొండ. డాక్టర్ సాగర్ల సత్తయ్య రాసిన ”బర్కతి” కథలు పరిమితమైన కల్పితాంశంతో రాయబడిన కథా సంబంధ కథలు.
ముస్లింలు నమాజు సమయంలో ధరించే టోపీని ”బార్కాతి” అంటారు. ఇది పవిత్రత, భక్తికి చిహ్నం. ”వల్ బరకతి” అంటే ”ఆశీర్వాదం” అని అర్ధం. తెలంగాణ ప్రాంతంలో ”బర్కతి” అంటే ”పంటల రాబడి, భాగ్యవంతమైన” అనే అర్ధాలలో ఉపయోగిస్తారు. తెలంగాణ పద(బంధ) కోశం ప్రకారం ”అర్కతి బర్కతి లేకపోవడం” అంటే ”ఎప్పుడు వెలితితో లేమితో ఉండడ”మనే అర్ధం ఉంది. ప్రకతి ”బర్కతి” అయి ఉండవచ్చు.
డాక్టర్ సాగర్ల సత్తయ్య రాసిన ”బర్కతి”లో పదిహేను కథలున్నాయి. ఇవి సమకాలీన గ్రామీణ బహుజన జీవితాలు. బహుజన జీవితాలు ఉత్పత్తి కులాలుగా ఉన్నప్పటికీ వెలితితో, లేమితో ఉంటాయి. అయినా వారి జీవితం నిండైన సంస్కతీకరణతో, అనుబంధాలు, ఆప్యాయత గల పలకరింపుల కలబోతగా కలిమితో ఉంటాయి. ”బర్కతి”కథలలో ఈ రెండు పార్శ్వాలు కనిపిస్తాయి. బహుజన రాజకీయోద్యమం బలపడుతున్న వర్తమానకాలంలో ”బర్కతి”కథలు బహుజన సాహిత్యానికి చక్కని జోడింపు.
”బర్కతి” కథలలో అచ్చమైన తెలంగాణ మధుర సంభాషణలతో కథాశ్కెలి కథనంతో సామాజికత, అభ్యుదయం, సంక్లిష్టత, సందిగ్దత, పరిష్కారం, సమత, మానవత, ఆలోచన, హేతువాదం, ఆత్మచ్కెతన్య భూమిక సారంగా కన్పిస్తుంది. కథా వస్తువులు పేదల అవిద్య, మూఢనమ్మకాలు, మత్తు, దళారీ దోపిడీ, కుల, లింగ వివక్ష, వత్తుల విధ్వంసం ఉంటాయి. ఇవి సమాజంలో విడివిడిగా లేవు. గొలుసుకట్టుగా ఉన్నాయి. వీటి బారినపడిన బహుజన జీవితాలు అర్కతి బర్కతి లేకుండా సంక్షోభంలో పడుతున్నాయి. రచయిత అభ్యుదయ సామాజిక బాధ్యత, బహుజన స్పహతో అవగాహన కల్పించడానికి వీటిని క్రమపద్దతిలో కథలను ఒడుపుగా రాశాడు.
సాహిత్య పరమావధి సమానత్వం, సంక్షేమం, మానవత్వం. సంక్షేమ బహుజన జీవితాలకు ప్రధాన ఆటంకం సామాజిక రుగ్మతలు. ఈ అవగాహనకు చదువే ముఖ్యం. సాగర్ల సత్తయ్య రాసిన మొదటి కథ ”పరిష్కారం” చదువు ప్రాధాన్యతను నొక్కిచెబుతుంది. బాలికలను ఉచిత విద్య ప్రభుత్వ విద్యకు, అబ్బాయిలను లక్షలుపోసి కార్పోరేట్ ఫలితాలలో ఎప్పుడూ బాలికలదే పైచేయి. అయినా సగటు తల్లిదండ్రులు అమ్మాయిల చదువును భారంగానూ, పెళ్లి విషయంలో బాకీగానూ చూస్తున్నారు. ఈ సమస్యను, విద్యప్రాధాన్యతను ”పరిష్కారం”, ”కోటిదీపాల వెలుగు”, ”ఓ మొగ్గ నవ్వింది” కథలు చెప్పాయి. వత్తుల విధ్వంసం గురించి ”సారె”, శాస్త్రీయదక్పథ ఆవశ్యకత గురించి ”మరుగుమందు”, దళారీ వ్యవస్థను ”ఎన్నుగర్ర”, ”తోడేళ్ళు”, కుల వివక్ష గురించి ”ఊరబోనాలు”, డ్రగ్స్ కల్చర్ గురించి ”చాపకింది నీరు” కథలో ఉంటుంది.
తెలంగాణ భాష, చారిత్రక, వారసత్వ ఆధారాలతో తెలుగు భాషకు ప్రాచీనహౌదా దక్కింది. ఇప్పటి కథకులు పత్రికాభాషకు అలవాటుపడ్డారు. ”బర్కతి” కథల్లో అచ్చమైన తెలంగాణ వ్యావహారిక భాష మాధుర్యం అన్నికథల్లో ఉంటుంది. సంభాషణలు, పలుకుబడులు కథకు ప్రాణం పోయడమే కాకుండా, ఆసక్తికర కథాగమనానికి తోడ్పడ్డాయి. నిజజీవిత అనుభవాలను కథగా మలిచినపుడు ప్రత్యేకమైన రచనాశ్కెలి సహజంగానే కన్పించదు. కత్రిమ పదబంధాల సష్టి, సన్నివేశాలు, అభూతకల్పనలు, ఊహించని మలుపులు ఏవీ ఉండవు. పాత్రీకరణలో సామాన్య జీవితానుభావాలు, అత్యున్నత విలువలు, అనుబంధాలు, అమాయకత్వం, స్వచ్చమైన సంస్కతి ”బర్కతి”లో పుష్కలంగా ఉంటాయి. డా. సాగర్ల సత్తయ్య వత్తిరిత్యా ఉపాధ్యాయుడు కావడంతో కథల్లో అక్కడక్కడా మహాప్రాణాక్షరాలతో కూడిన పదాలు, నాగరిక భాష ఉంటుంది. ఇది పాత్రోచిత, సన్నివేశ ఉచిత భాషగా ఉండి పాఠకుని అవగాహనను సులభతరం చేసేదిగా, వేగవంతమైన పఠనానికి ఉపయోగపడేవిధంగానే ఉంటుంది.
సమాజ సంక్షేమమంటే బహుజన సంక్షేమం. సహజంగానే వీటికి అందరి ఆమోదం లభిస్తుంది. ”బర్కతి” కథలు ప్రపంచవేదికతోబాటు పలు కథాపోటీలలో ఉత్తమ కథాపురస్కారాలను సొంతం చేసుకున్నాయి.
- శీలం భద్రయ్య