ఆలయ పరిసరాల వరకు వరద నీరు..
గోదావరి బ్రిడ్జిపై సందర్శకుల తాకిడి..
నవతెలంగాణ – ముధోల్
గత మూడు రోజులుగా విస్తారంగా భారీ వర్షాలు కురియటంతో శుక్రవారం బాసర గోదావరి ఉదృతంగా ప్రవహిస్తుంది. మహారాష్ట్రలో వర్షాలు భారీగా కురవడంతో అక్కడ ఉన్న డ్యాంలు గేట్లు ఎత్తివేయడంతో బాసర గోదావరి ఉధృతితంగా ప్రవహిస్తుంది. దీంతో గోదావరి స్నానఘట్టాలు నీట మునిగి, సరస్వతి ఆలయంకు వేళ్ళే రోడ్లు,లాడ్జిలు , నివాస గృహాలు వరకు నీళ్ళు చేరాయి.దీంతో జిల్లా ఎస్పీ జానకి షర్మిల, శుక్రవారం బాసర ను సందర్శించారు.
నివాస గృహాల్లో, లాడ్జిల్లో ఉన్నవారిని ప్రత్యేక బోట్ల సాయంతోసురక్షిత ప్రాంతానికి తరలించారు. సాయత్రం వరకు గోదావరి ఉదృతి ఇంకా భారిగా కొనసాగుతూనే ఉంది. ఇంత ఉదృతంగా గోదావరి ప్రవహించటం 1983 సంవత్సరంలో జరిగిందని బాసర వాసులు పేర్కొంటున్నారు. గోదావరి ఉధృతిని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, నిజాంబాద్ జిల్లా ప్రజలు గోదావరి బ్రిడ్జిపై నుండి తిలకింస్తున్నారు. దీంతో సందర్శకుల తాకిడి పెరిగింది. దీంతో బాసర ఎస్ఐ శ్రీనివాస్, పోలిస్ సిబ్బంది గోదావరి పరిసరాల కు సందర్శకులను అనుమతించడం లేదు. దూరం నుంచి గోదావరి ప్రవాహంను సందర్శకులు తిలకిస్తున్నారు. గోదావరి అటు వైపు నిజామాబాద్ రూరల్ సిఐ బి.శ్రీనివాస్ ఆధ్వర్యంలోనవిపేట్ ఎస్ఐ తిరుపతి పరిస్థితి ని పర్యవేక్షించారు. గోదావరి ఉధృతి రేపటి వరకు కొనసాగనుంది.
