ప్రభుత్వ విప్ ఎమ్మెల్యేలు
నవతెలంగాణ- ఆలేరు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బస్వపురం ప్రాజెక్టులో నీళ్లు నింపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఎమ్మెల్యేలతో కలిసి విజ్ఞప్తి చేశారు. ఆదివారం ముఖ్యమంత్రిని కలిసి బసవపూర్ ప్రాజెక్ట్ లోకి గోదావరి నీళ్ళని మళ్లించి నింపినట్లైతే ఉమ్మడి జిల్లాలో నాలుగు నియోజకవర్గాలలో పంట పొలాలకు నీటి ఎద్దడి ఉండదని వివరించినట్టు చెప్పారు.ఎండాకాలంలో వేలాది ఎకరాలకు నీరు అందించినట్లయితే ప్రజా పాలనలో ప్రజల ఆకాంక్షల సాధన కు మరో పెద్ద ముందడుగు అవుతుందన్నారు భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ తో కలిసి వినతి పత్రం ఇచ్చినట్లు చెప్పారు.
బసవపురం నీళ్ల కోసం ముఖ్యమంత్రికి విజ్ఞప్తి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



