వ్యాధి నిర్థారణకు ఒక సమగ్ర విధానపై సమాలోచన చేయాలన్న వైద్య నిపుణులు..
-ఇండియన్,తెలంగాణ-అసోసియేషన్ ఆఫ్ పాథాలజిస్టులు,మైక్రోబయాలజిస్టులు చాప్టర్లు..
నవతెలంగాణ – బంజారాహిల్స్
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పాథాలజిస్టులు మైక్రోబయాలజిస్టులు తెలంగాణా చాప్టర్లు సంయుక్తంగా కలిసి శనివారం ఎప్యూషన్ సైటాలజీలో ప్రావీణ్యం,వ్యాధి నిర్థారణకు ఒక సమగ్ర విధానం ( Mastering Effusion Cytology,An Integrated Approach to Diagnosis),పేరుతో ఒక రోజు వర్క్ షాపును నిర్వహించారు.
ఈ వర్క్ షాపులో ప్రధానంగా ఎఫ్యూషన్ సైటోలజీలో రోగనిర్ధారణ సవాళ్లు,సమగ్ర విధానాలపై దృష్టి సారించారు.దీంతో పాటూ ఎఫ్యూషన్ నమూనాల కోసం సైటోలాజికల్ పద్ధతుల్లో పురోగతి,రోగనిర్ధారణ ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడంలో సహాయక పరీక్ష పాత్ర, వాస్తవ ప్రపంచ క్లినికల్ సందిగ్ధతలను హైలైట్ చేసే కేస్ ఆధారిత చర్చలను కూడా నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ప్రతినిధులు ప్రెజెంటేషన్ల స్పష్టత,ఇంటరాక్టివ్ కేసు చర్చలతో పాటూ కార్యక్రమంలో భాగంగా అందించిన అంశాళ యొక్క ఆచరణాత్మక ఔచిత్యాన్ని ప్రశంసించారు.సంబంధిత పద్ధతుల్లో రోగనిర్ధారణ ఖచ్చితత్వం,రోగి సంరక్షణను నేరుగా పెంచే కార్యాచరణను వర్క్ షాపు అందించింది.
బంజారాహిల్స్ బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రిలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వళనతో ప్రారంభమైన కార్యక్రమన్నీ ఉద్దేశించి హెడ్,మెడికల్ ఆంకాలజీ విభాగం డా.సెంథిల్ రాజప్ప మాట్లాడుతూ.. ఇలాంటి వర్క్ షాపులు పాథాలజిస్టులు వైద్యుల మధ్య సహకారాన్ని పెంపొందించడం మెరుగైన ఫలితాల కోసం రోగనిర్ధారణ నైపుణ్యాన్ని బలోపేతం చేయడం చేస్తాయని అన్నారు.బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ లో వైద్యులు సంపాదించిన నైపుణ్యాలను ఇతరులకు అందజేయడమే లక్ష్యంగా నిర్వహించే ఇలాంటి కార్యక్రమాలు సంస్థ యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తాయని వివరించారు.
డాక్టర్ సెంథిల్ జె రాజప్ప,డాక్టర్ సిలంబరసన్ మాస్కోమణి,డాక్టర్ కల్పనా రఘునాథ్,డాక్టర్ కె ఫణి కోటేశ్వరరావు,డాక్టర్ సుశీల కోదండపాణి,డాక్టర్ నవల్ కిషోర్,డాక్టర్ రాధిక,డాక్టర్ సుమయ్య ఫాతిమా లు ఫాకల్టీ సభ్యులుగా వ్యవహించిన వర్క్ షాపులో 250 మందికి పైగా ప్రతినిధులు పాల్గొనగా 100 మందికి పైగా ఆన్‌లైన్‌లో జాయిన్ అయ్యారు.
ఈ కార్యక్రమాలలో ఆసోసియేట్ డైరెక్టర్, అకడమిక్స్,డా.కల్పనా రఘునాథ్,మెడికల్ సూపర్నింటెండెంట్,డాక్టర్ కె ఫణి కోటేశ్వరరావు,హెడ్, పాథాలజీ విభాగం,డాక్టర్ సుశీల కోదండపాణి, హాస్పిటల్ వైద్యులు డాక్టర్ సిలంబరసన్ మాస్కోమణి, డాక్టర్ నవల్ కిషోర్, డాక్టర్ రాధిక, డాక్టర్ సుమయ్య ఫాతిమా లతో పాటూ పలువురు వైద్యులు, వైద్య విద్యార్థులు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.



