నవతెలంగాణ – కంఠేశ్వర్
జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలు నిర్వహించారు. కలెక్టరేట్లో ఐడిఓసి సమావేశ మందిరములో నిర్వహించిన వేడుకలకు అదనపు కలెక్టర్ అంకిత్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆ మహనీయుని ఆశయాలకు అనుగుణంగా సామాన్యులకు ఫలాలు అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి శ్రీమతి బి. స్రవంతి, జిల్లా సహాయ వెబత అభివృద్ధి అధికారి పి. నర్సయ్య, సి గంగాధర్, లింగాయత్ వర్గం నుండి శ్రీ వి. చంద్రశేఖర్, యల్. బసవన్న, బి. రాజ్కుమార్, బుస్స అంజనేయులు, మాయావర్ రాజేశ్వర్ తదితర బిసి నాయకులు వసతి గృహ సంక్షేమాధికారులు కార్యాలయ సిబ్బంది పాల్గోన్నారు.
శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలు
- Advertisement -
RELATED ARTICLES