– డాక్టర్ దిడ్డి సుధాకర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ అధ్యక్షులు సౌరవ్ భరద్వాజ్‌పై ఈడీ చేసిన ఆరోపణలు నిరాధారామైనవని ఆ పార్టీ తెలంగాణ కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ కొట్టిపారేశారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సౌరవ్ భరద్వాజ్‌పై ఈడీ చేస్తున్న ఆరోపణలు ఆయన ఆరోగ్య మంత్రిగా లేని కాలానికి చెందినవని తెలిపారు. గతంలో ఢిల్లీ ఆరోగ్యశాఖ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌ను మూడేళ్లు జైళ్లో ఉంచిన తర్వాత సీబీఐ ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చిందని గుర్తుచేశారు. ఈడీ, సీబీఐ కేసులతో బీజేపీ తన వ్యతిరేకులను బెదిరించి కమలం పార్టీలో చేర్చుకుందనీ, అలాంటివేవి ఆప్ దగ్గర కుదరవని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆప్ నాయకులు బుర్రా రాములు గౌడ్, విజరు మల్లంగి, యమున గౌడ్, హేమ జిల్లోజు, జావీద్ షరీఫ్, శివాజీ, దర్శనం రమేష్, అజీమ్ బైగ్ పాల్గొన్నారు.
సౌరవ్ భరద్వాజ్‌పై నిరాధార ఆరోపణలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES