Wednesday, August 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్ల బేస్మెంట్ త్వరగా పూర్తి చేయాలి: ఎంపీడీఓ

ఇందిరమ్మ ఇండ్ల బేస్మెంట్ త్వరగా పూర్తి చేయాలి: ఎంపీడీఓ

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
ఇందిరమ్మ ఇండ్ల బేస్మెంట్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని మండల ఎంపీడీఓ ఉమాదేవీ అన్నారు. మండలం లోని  బట్టుగూడెం గ్రామపంచాయతీలో.మంగళవారం మండల అభివృద్ధి అధికారి ఇందిరమ్మ ఇండ్లు ప్రగతిని, ఇప్పటివరకు గ్రామంలో బేస్మెంట్ లెవల్లో  జరుగుచున్న పనులు పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. అందరూ ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు తొందరగా బేస్మెంట్ నిర్మాణాలు పూర్తి చేసుకున్నట్లయితే ఒక లక్ష రూపాయలు వెంటనే ఖాతాలో జమవుతాయని తెలిపారు.

కాబట్టి తదుపరి నిర్మాణమునకు వారికి ఆర్థిక వెసులుబాటు కలుగుటుందని అన్నారు. కావున మండలంలో మంజూరైన లబ్దారులందరూ వెంటనే  త్వరగా మార్కింగ్ చేయించుకోవాలని కోరారు.మార్కింగ్ చేసిన లబ్ధిదారులు ఇల్లు నిర్మాణాలు త్వరగా చే పట్టాలని  తెలిపారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాల మేరకు ఇల్లు నిర్మాణం చేసుకొనుటకు ఆర్థికంగా వెనుకబడిన వారికి మహిళా సంఘాల నుండి లోన్ సౌకర్యం కూడా కల్పించబడునని అన్నారు.ఈకార్యక్రమంలో కార్యదర్శి నాగిరెడ్డి,లబ్ధిదారులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -