Saturday, May 3, 2025
Homeఆటలుబాస్కెట్‌బాల్‌ టోర్నీ షురూ

బాస్కెట్‌బాల్‌ టోర్నీ షురూ

హైదరాబాద్‌ : ఎల్‌వీఆర్‌ మెమోరియల్‌ బాస్కెట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ టోర్నమెంట్‌ ఘనంగా ఆరంభమైంది. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌, తెలంగాణ బాస్కెట్‌బాల్‌ సంఘం అధ్యక్షుడు రావుల శ్రీధర్‌ రెడ్డిలు శుక్రవారం విక్టరీ ప్లేగ్రౌండ్‌లో టోర్నమెంట్‌ను ప్రారంభించి, క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఏడు రోజుల పాటు జరుగనున్న ఈవెంట్‌లో పురుషుల విభాగంలో 28 జట్లు, మహిళల విభాగంలో 12 జట్లు పోటీపడుతున్నాయి. మే 9న ఫైనల్స్‌ జరుగుతాయని నిర్వహణ కార్యదర్శి ప్రసాద్‌ తెలిపారు. తెలంగాణ ఒలింపిక్‌ సంఘం కార్యదర్శి మల్లారెడ్డి, టెక్నో పెయింట్‌ ఎండీ శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img