నవతెలంగాణ- కమ్మర్ పల్లి
మండలంలోని ఉప్లూర్ మండల పరిషత్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గిరిధర్ మాట్లాడుతూ తెలంగాణలో ఆడపడుచులు అద్భుతంగా జరుపుకునే ఉత్సవం ఈ బతుకమ్మ పండుగ అన్నారు. ఆడవారు శక్తిమాత అయిన గౌరమ్మను నవరాత్రులు పూజించి, అమ్మవారి ఆశీస్సులను పొంది వచ్చే ఏడాది వరకు అష్టైశ్వర్యాలను అందించి మమ్మల్ని చల్లగా కాపాడుమని వేడుకొని బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేయడం ఆనవాయితీగా కొనసాగుతుందన్నారు.
ప్రకృతిలో లభించే పూలను సైతం పూజించే సాంప్రదాయం హైందవ సంస్కృతిలోనే ఉందన్నారు.బతుకమ్మతో గౌరమ్మను కూడా నీటిలో వదలడం వల్ల వర్షాల వల్ల కొత్తగా వచ్చి చేరిన నీటిలో ఉండే బ్యాక్టీరియాను పసుపు కుంకుమతో తయారు చేసిన గౌరమ్మను నీటిలో కలపడం వల్ల సుఖ క్రీములను నశించి నీటిని శుద్ధి చేయడం సైన్స్ లో భాగమే ఉందన్నారు. ప్రతిదీ పూర్వికులు ఇటు సైన్సును జోడించి, అటు భక్తిని చూపడం అనేది చాలా గొప్ప విషయం అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ ఆటపాటలతో ఘనంగా బతుకమ్మ ఉత్సవాన్ని జరుపుకొని అనంతరం బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మాసం శ్రీనివాస్ గౌడ్, సుమలత, శిరీష తదితరులు పాల్గొన్నారు.
ప్రాథమిక పాఠశాలలో బతుకమ్మ సంబురాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES